
సత్యం వార్త / నంద్యాల / జనవరి 7 :
కడపలో జరగబోయే దీని ఇజ్తిమ కొరకు నంద్యాల మీదుగా స్పెషల్ ట్రైన్ దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి బుధవారం తెలిపారు.
కడపలో దీని ఇజ్తిమ జనవరి 23 నుండి 25 వరకు జరగబోతుందనీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఇజ్తిమకు హాజరవుతారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పెషల్ ట్రైనీ నడుపుతున్నారనీ, రైలు నెంబర్ 07140 చర్లపల్లి _తిరుచానూరు 22 వ తేదీ చర్లపల్లి లో బయలుదేరి వయా నిజామాబాద్, వరంగల్, విజయవాడ,గుంటూరు, మీదుగా నంద్యాలకు 23 వ తేదీ ఉదయం 5:30 కు వచ్చి కడపకు బయలుదేరి, మళ్ళీ రేణిగుంట మీదుగా తిరుచానూరు చేరుకుంటుందనీ. రైలు నెంబర్ 07141 తిరుచానూరులో 25 జనవరి రాత్రి 11:30 కు బయలుదేరి కడపకు ఉదయం 3 గంటలకు చేరుకొని, నంద్యాల కు ఉదయం 6:50 చేరుకొని గుంటూరు, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ మీదుగా చర్లపల్లికి వెళ్లనుందనీ. నంద్యాల నుండి కడపకు ఇజ్తిమకు వెళ్ళే భక్తులకు ఈ రైలు చాలా ఉపయోగ పడుతుందనీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. దీని ఇజ్తిమకు రాను పోను క్యే స్పెషల్ ట్రైన్ వేసిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధన్యవాదములు తెలిపారు. నంద్యాల జిల్లా ముస్లిం సోదరులు ఈ ప్రత్యేక రైలును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.
