ఓటర్ల ప్రతిజ్ఞ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 23 :  

భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2011 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లోని వివిధ శాఖల సిబ్బందితో కలెక్టర్ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై సంపూర్ణ విశ్వాసంతో, దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుతూ, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉంటామని; మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, చేర్పులు-తొలగింపులు, మార్పులు, తప్పుల్లేని ఓటరు జాబితా తయారీ, పోలింగ్ శాతం పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలు, అలాగే 18–19 సంవత్సరాల వయస్సు గల యువత ఓటరు నమోదు అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

Scroll to Top