

ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
విధులు సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో దిశానిర్ధేశం
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునిల్ షోరాణ్ IPS ఆదేశాలమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుఘంధర్ బాబు.
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 19 :
నంద్యాల జిల్లా సాయుధ పోలీసు బలగాలు ఏర్పాటు చేసిన “మొబిలైజేషన్ ” ప్రారంబ కార్యక్రమం నంద్యాల జిల్లా పోలీసు ఆఫీసు ఎదురుగా గల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునిల్ షోరాణ్ IPS ఆదేశాలమేరకు ముఖ్యఅతిథిగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుఘంధర్ బాబు పాల్గొని చట్ట పరిదిలో జరుగుచున్న మార్పులు శాంతిభద్రతలో కొత్తగా తలెత్తే సమస్యలపట్ల అవగాహన కలిగి ఉండాలని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నిరంతరం మన వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాబోయే రోజులలో మన విధులలో మనం ఎదుర్కొనబోయే అవరోదాలను అదిగమించే విదంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని తెలియజేశారు. జిల్లా సాయుధ పోలీసు బలగాలు ఈ కార్యక్రమంను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి తెలియజేశారు.
ఏ.ఆర్ సిబ్బందికి ప్రతీ ఏటా మొబలైజేషన్ కార్యక్రమం అనేది ఒక రీఫ్రెష్మెంట్ కోర్స్ లాంటిదని మీదైనందిన విధులలో మెరుగుపరుచుకునేందుకు విధులలో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ ను మెరుగుపరచడం జరగాలని, ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ మొబలైజేషన్ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.
పోలీసుల దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నవేనన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యాంగా ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడానికి వీలౌతుందన్నారు. ఇందులో భాగంగా ఏ.ఆర్ సిబ్బందికి అందరికీ మెడికల్ క్యాంపు నిర్వహించి సిబ్బంది అందరికీ పరీక్షలు చేయించమని తెలిపారు. సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా, ధ్యానం గురించి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు.
ఫైరింగ్ , డ్రిల్ , కవాతు, మాబ్ కంట్రోల్ , ప్రముఖుల బందోబస్తు, తదితర విధులు మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో దిశానిర్ధేశం చేశారు.సిబ్బంది సంక్షేమంలో భాగంగా సిబ్బంది ఆరోగ్యపరంగా మరియు సిబ్బంది యొక్క పిల్లలకు మంచి విద్యను ఇవ్వడం కొరకు కృషి చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదిశంల్ ఎస్పీ అడ్మిన్ తో పాటు జిల్లా సాయుధ బలగాల డిఎస్పి శ్రీనివాసులు, రిజర్వు ఇన్స్పెక్టర్ బాబు, RSI లు మనోహర్ ఉమామహేశ్వర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
