


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 20 :
గోస్పాడు మండలంలోని ఎస్. నాగులవరం గ్రామంలో నిర్వహించిన మారెమ్మ జాతర సందర్భంగా రాజకీయ, సామాజిక వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. గ్రామ టిడిపి నాయకులు నరేంద్రనాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, నాగభూషణం రెడ్డి, నాగేష్ ఆహ్వానం మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జాతర కార్యక్రమం సంప్రదాయ పూజలు, ప్రత్యేక హారతులు, గ్రామస్తుల భారీ హాజరుతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూమా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ, గ్రామ దేవతల పట్ల ప్రజల భక్తి, సంప్రదాయాల పరిరక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు.
