

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 28:
నంద్యాల టౌన్ స్థానిక 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక మంత్రి వర్యులు ఎన్ఎండి.ఫరూక్ వారి కుమారులు ఎన్ఎండి.ఫిరోజ్, ఎన్ఎండి ఫయాజ్ ఆదేశాల మేరకు వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు మాట్లాడుతూ 1వ తేదీ సెలవు దినం కావడం వలన ఒక్కరోజు ముందుగా అనగా 28వ తేదీన అవ్వ తాతలకు,వికలాంగులకు, వృద్దులకు పెన్షన్ పంపిణీ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయంగా ఉంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మరియు సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
