

డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పలు అంశాలపై ఆర్డీవోలు, తహసిల్దార్ లు, ఎంపీడీవోల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. డిసెంబర్ 31వ తేదీన జిల్లాలో ఉన్న అర్హులందరికీ వంద శాతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదని పెన్షన్ పంపినదారులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి పెన్షన్లు అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్ దారులకు పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. పెన్షన్ల పంపిణీ పై పెన్షన్ దారుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని లబ్ధిదారుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. పెన్షన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేయకూడదన్నారు. పెన్షన్ల పంపిణీ పై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు.
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. చెత్త సేకరణలో పారిశుధ్య కార్మికులు నిర్లక్ష్యం చేయరాదన్నారు.
జిల్లాలో వివిధ గ్యాస్ ఏజెన్సీలలో పనిచేస్తున్న గ్యాస్ డెలివరీ బాయ్ లు ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేసే సమయంలో ఇంటి యజమానుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. గ్యాస్ బాయ్ లు గ్యాస్ బిల్లులో ఉన్న రేటు కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేయరాదన్నారు. అధిక డబ్బులు వసూలు చేస్తే ఆయా గ్యాస్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
డీలర్ షాపు యజమానులు ప్రతినెల రేషన్ సరుకులను సక్రమంగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నాణ్యమైన సరుకులు ప్రజలకు ఇవ్వాలన్నారు. సరుకుల పంపిణీలో ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకూడదన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకంలో ప్రయాణికులకు ఆర్టీసీ బస్టాండ్లలో మెరుగైన వసతులు కల్పించాలన్నారు.
ఆర్టీసీ బస్టాండు పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని ప్రయాణికులకు మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు.
