



సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 21 :
పట్టణంలోని టౌన్ హాల్ ప్రక్కన ఉన్న మున్సిపల్ పార్కు లో ఆయుష్ యోగా కేంద్రంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో 12 లక్షల విలువగల కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కాకుండా దాదాపు అర్హులైన కర్నూలు,నంద్యాల, ఆదోని,అనంతపురం తాడిపత్రి,ధర్మవరం నుండి కూడా దివ్యాంగుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దాదాపు 98 మంది అర్హులకు 12 లక్షల విలువగల కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధులు మాట్లాడుతూ దివ్యంగులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు అందించడం చాలా శుభ పరిణామం అని భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు కూడా తమ వంతు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు అందిస్తామని ఈ కార్యక్రమంలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ఖండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ తనకు కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఎంతో ఇబ్బంది పడ్డారనన్న విషయాన్ని గుర్తు చేశారు మరి అలాంటప్పుడు శాశ్వతంగా దివ్యాంగులైన పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని గ్రహించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేసి వారికి అందించాలని నిర్ణయించుకున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డా.జీ.రాకృష్ణారెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు,నెరవాటి సత్యనారాయణ, తెలుగు దేశం పార్టీ నాయకులు 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యాంసుందర్ లాల్,నంద్యాల ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు బింగుమల్ల శ్యాంసుందర్ గుప్తా,ఆయుష్ యోగ అధ్యక్షులు ఖండే ఆనంద్ గురూజీ,మాజీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి,జనరల్ సెక్రటరీ రామాంజనేయ ప్రసాద్, కర్నూలు బాలసుబ్రమణ్యం,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఆర్థికంగా తాతిరెడ్డి తులసి రెడ్డి , గోళ్ళ రాజేష్ , సోమ సుబ్రహ్మణ్యం , పబ్బతి వేణు ఒక్కొక్కరు 30 వేల ప్రకారము గోళ్ళ సుదర్శన్, అనిల్ రెడ్డి పాలూరు రాజా షేగు నాగరాజు షోలే ట్రావెల్స్ గౌస్ వర్మ జ్యువెలర్స్ తదితరులు 15000 10000 6000 3000 ప్రకారం ఆర్థిక సాయం అందజేశారు వీరందరికీ భారత్ వికాస్ పరిషత్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
