

భక్తుల భద్రత దృశ్య కాలినడక మార్గంలో పటిష్ట చర్యలు
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 07 :
నంద్యాల జిల్లాలోని మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేశం నలుమూలల నుండి తరలివచ్చి ఆ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోనున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆత్మకూరు నుండి శ్రీశైలంనకు వెళ్లే కాలినడక మార్గాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆత్మకూరు నుండి శ్రీశైలంనకు వెంకటేశ్వరపురం మీదుగా నాగలూటి గూడెం, వీరభద్ర స్వామి టెంపుల్, అడవిలో గల బేస్ క్యాంప్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటుచేసిన నీళ్లు, ఆహారం తదితర వసతులను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నేటి నుండి వెంకటేశ్వరపురం మీదుగా శ్రీశైలంనకు వెళ్లే కాలినడక మార్గాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఆహారం ,నీరు తదితర సౌకర్యాలను కల్పించడంతోపాటు భక్తుల భద్రత కొరకు కాలినడక మార్గాన్ని పోలీస్ బాంబ్ డిస్పోజల్ టీం సహాయంతో తనిఖీ చేయడం జరిగిందని, జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బందిచే కాలినడక మార్గాన్ని పోలీసు స్వాధీనంలోనికి తీసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్, ఆత్మకూరు పోలీస్ అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ సిబ్బంది పాల్గొన్నారు.
