అసౌకర్యల మధ్య విజయవంతం అయినా ఇక్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 16 :

​నంద్యాల పట్టణంలోని ఇక్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నబి నగర్ లోని ఒక ఖాళీ స్థలం లో ఏర్పాటు చేసారు, అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  కార్యక్రమ స్థలం వద్ద సరైన రోడ్డు లేకపోవడం వల్ల రాళ్లు, గుంతల మధ్య నడవడం కష్టమైంది. మురుగు కాలువలు తెరిచి ఉండడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దుర్వాసనతో ఇబ్బంది పడ్డారు, బాత్రూమ్స్ కూడా లేవు, చిన్న చిన్న పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. అలాగే దోమల సమస్య ఎక్కువగా ఉండటం వల్ల చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడ్డారు. సరైన లైటింగ్‌ సదుపాయం లేకపోవడంతో చీకట్లో కూర్చోవాల్సి వచ్చింది.  పార్కింగ్‌ వంటి ప్రాథమిక ఏర్పాట్లు కూడా తగిన విధంగా లేకపోవడంతో తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలు త్రాగే చిన్న పిల్లలతో వచ్చిన తల్లులకు నరకం కనపడింది, కూర్చుడానికి స్థలం లేక, పిల్లల ఏడుపులు, దోమలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొంత మంది మధ్యలోనే వెళ్లిపోయారు, మరి కొంత మంది తమ పిల్లలు అట, పాటలను చూడాలనే ఉద్దేశం తో తప్పని పరస్థితిలో ఎంత ఇబ్బంది కలిగిన ఓపికతో కూర్చున్నారు.  గత 5–6 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని తల్లిదండ్రులు తెలిపారు.  వేలల్లో ఫీజులు తీసుకుంటున్నప్పటిటి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కానీ పరిస్థితి..భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ముందు రోడ్డు, లైటింగ్‌, పారిశుధ్యం, శుభ్రమైన బాత్‌రూమ్‌లు, దోమల నివారణ, పార్కింగ్‌ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని కోరుతున్నారు.

Scroll to Top