
సత్యం వార్త / నంద్యాల / జనవరి 24 :
ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (అల్ మెవా ఏపీ) నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన అల్ మెవా ఏపీ డైరీ–2026 ను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు జనాబ్ ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నేడు నంద్యాలలోని వారి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు మైనారిటీ ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన ఈ డైరీ అభినందనీయమని పేర్కొన్నారు. అల్ మెవా ఏపీ సంఘం ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రివర్యుల వారికి రాష్ట్ర ఆల్మెవా రాష్ట్ర శాఖ తరపున రెండు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇందులో మొన్న సిరివెళ్ల మెట్ట దగ్గర జరిగిన బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించి 36 మంది ప్రయాణికులను తమ సమయ స్ఫూర్తితో కాపాడిన షేక్ మెహరాజ్ మరియు షేక్ సమీర్ లకు గణతంత్ర దినోత్సవం లో బ్రేవరీ అవార్డు ఇవ్వాలన అదేవిధంగా సిరివెళ్ల నిర్మితమైతున్న సపరేట్ ఉర్దూ హై స్కూల్ కు సంబంధించి ప్రహరీ గోడకు సంబంధించి పూర్తి చేయాలని విన్నవించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అల్ మెవా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ భాష, ఉర్దూ డిఐ షేక్ అసముద్దీన్ సర్ ,జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ మొహమ్మద్ గౌస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ నబీ రసూల్ , మోమిన్ సైదుల్లా ,మిర్జా మాలిక్ బిగ్ జిల్లా కార్యవర్గ సభ్యులు, డీఎస్ నూరుల్లా ప్రజలే రబ్బాని , సయ్యద్ అబ్దుల్ ముని ఎస్ఎంఎండి నమాన్ భాష , ఎం కరిముల్లా, షేక్షావలి,, అబ్దుల్ షరీఫ్ , సిరివెళ్ల అబిద్, , బి కరీముల్లా, సయ్యద్ జాకీర్ హుస్సేన్ ఖలీల్ మరియు ప్రముఖులు పాల్గొని డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
