
సత్యం వార్త / నంద్యాల / జనవరి 19 :
నంద్యాల మండలంలో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖతో పాటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి విత్తన శుద్ధి కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ వ్యవసాయ అధికారి విశ్వనాథ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి. పవన్ కిషోర్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకట ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి నంద్యాల ప్రసాద్ రావు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలోని భవ్య సీడ్స్, శ్రావణలక్ష్మి సీడ్స్, ఆంధ్రా కాటన్ విత్తన శుద్ధి కేంద్రాలను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన అనుమతి పత్రాలు లేనందున ఆద్య సీడ్స్ కంపెనీకి చెందిన 142 క్వింటాళ్ల పత్తి విత్తనాలను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.91 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత సంస్థపై 6A కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మాట్లాడుతూ, నంద్యాల మండలంలోని విత్తన శుద్ధి కేంద్రాలు ప్రభుత్వ అనుమతి పొందిన పత్తి విత్తనాలనే ప్రాసెసింగ్ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విత్తన చట్టం 1966 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
