

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 21 :
నంద్యాల జిల్లా బండిఆత్మకూరు నియోజయవర్గం మండలం చిన్నదేవలాపురం గ్రామం మజారా బరకల కాలనీ నందు నివాసం మౌలాలి ఉంటున్న ఎరుకలి మల్లె సాలమ్మ, షేక్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల సురేష్ రెడ్డి మరియు నంద్యాల 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ టిడిపి ఇన్చార్జి తాటికొండ బుగ్గరాముడు తన స్వ గ్రామస్తులైన బాధితుల ఇంటి దగ్గరికి వెళ్లి పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా మల్లె సాలమ్మకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కంచర్ల సురేష్ రెడ్డి 5000/- రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యం పట్టణం నందు పై అధికారులతో మాట్లాడి మన తెలుగుదేశం పార్టీ తరఫున అందచేసే విధంగా చూస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
