అక్షర ఆంధ్ర కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

నిరక్షరాస్యుల సర్వే, వాలంటీర్ వ్యవస్థ, ఎఫ్.ఎల్.ఎన్.ఏ పరీక్షల పై సమీక్ష

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 12 :
అక్షరాస్యత సాధనలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్ లను సూచించారు. సోమవారం సాయంత్రం ఏపీ సచివాలయం నుంచి అక్షర ఆంధ్ర కార్యక్రమ పురోగతి పై ప్రిన్సిపల్ సెక్రటరీ వయోజన విద్యా శాఖ డైరెక్టర్ పి. రంజిత్ భాష తో కలిసి “అక్షరాంధ్ర” పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్లోని ఎన్ఐసి వీసీ హాల్ నుంచి.. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తో పాటు వయోజన విద్య నోడల్ అధికారి భాస్కర్ రెడ్డి తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ మాట్లాడుతూ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరక్షరాస్యుల సర్వే, వాలంటీర్ల సర్వే, లెర్నింగ్ సెంటర్ల నిర్వహణ, సెంటర్లలో బోధన జరుగుతున్న ఫోటోగ్రాఫ్‌లు తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. అక్షరాస్యత సాధనలో ప్రతి అంశాన్ని పక్కాగా అమలు చేయాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అలాగే ఎఫ్.ఎల్.ఎన్.ఏ (ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా అంచనా) పరీక్షల నిర్వహణపై కూడా సూచనలు చేశారు.

Scroll to Top