
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 11 :
అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా చాంద్‌బాడా ప్రాంతంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర తరగతులను కమిషనర్ బి శేషన్న , మేప్మా పీడీ వెంకటదాస్ , మేప్మా సిఎంఎం భాస్కర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. తరగతుల నిర్వహణ, హాజరు, బోధన విధానాలపై వారు వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చదువు నేర్చుకోవడానికి వచ్చిన అభ్యాసులతో కమిషనర్ బి శేషన్న మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అక్షరాస్యులుగా మారాలని సూచించారు. విద్యతో వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాక సమాజ ప్రగతికి దోహదం అవుతుందని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 28న నిర్వహించే ముందస్తు పరీక్షలో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని, మార్చి 29న జరిగే తుది పరీక్షలో ఉత్తీర్ణులు అయి రాష్ట్ర అక్షరాస్యత శాతాన్ని పెంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
