శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల లో ఎస్‌బిఐ యూత్ లైఫ్ ఆఫ్ ఇండియా – ఓరియంటేషన్ కార్యక్రమం

విద్యార్థులు నైపుణ్యాలు తో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలి

సత్యం వార్త / నంద్యాల / జనవరి 20 :
విద్యార్థులు నైపుణ్యాలు తో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలి శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మెన్ జి.రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎస్‌బిఐ యూత్ లైఫ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా కవిప్రియ శివకుమార్(ఫెసిలిటేటర్) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రగతి రెడ్డి (అసిస్టెంట్ ప్రొఫెసర్), M విజయకాంత్ (ఎన్ఎస్ఎస్ అధికారి) విశేషంగా పాల్గొని తమ సందేశాలతో విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమ ఆరంభంలో అతిథులకు స్వాగతం పలికిన అనంతరం, విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడే విధంగా ఎస్‌బిఐ యూత్ లైఫ్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ లక్ష్యాలు, అవకాశాలు ప్రయోజనాలను వివరించారు.
ముఖ్య అతిథి కవిప్రియ శివకుమార్ విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగం అందిస్తూ, యువతలో నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించారు. అలాగే ప్రాజెక్ట్ అమలు విధానం, పాల్గొనే విధానం, కెరీర్ అవకాశాలపై స్పష్టమైన సమాచారం ఇచ్చారు.
తదనంతరం పీపీటీ ప్రదర్శన ద్వారా ప్రాజెక్ట్ వివరాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థులు ప్రాజెక్ట్ లక్ష్యాలు, కార్యాచరణ విధానం మరియు భవిష్యత్తులో పొందగల లాభాలను స్పష్టంగా తెలుసుకున్నారు.
కళాశాల చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి తన ప్రసంగంలో విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, నైపుణ్యాలతో పాటు నైతిక విలువలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ప్రగతి రెడ్డి , విజయకాంత్ విద్యార్థులకు ప్రోత్సాహకరమైన మాటలతో కార్యక్రమానికి మరింత ఉత్సాహం నింపారు. కార్యక్రమం చివర్లో విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ముద్రిత , ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, కళాశాల అధ్యాపకులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మరియు భవిష్యత్తు కెరీర్‌కు దోహదపడే విధంగా ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

Scroll to Top