శ్రీశైలంలో ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలు – జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 11 :

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తుల సందోహం మధ్య కొనసాగుతున్నాయి. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి రోజురోజుకు భక్తుల రాక పెరుగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తోంది.

బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ఇప్పటివరకు మొత్తం 1 లక్ష 95 వేల 555 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 50 వేల 504 మంది శివ స్వాములు ఉన్నారు.

ఫిబ్రవరి 08న 45 వేల 360 మంది దర్శించుకోగా 7 వేల మంది శివ స్వాములు ఉన్నారు.

ఫిబ్రవరి 09న 49 వేల 015 మంది దర్శించుకోగా 15 వేల 600 మంది శివ స్వాములు ఉన్నారు.

ఫిబ్రవరి 10న 70 వేల 930 మంది దర్శించుకోగా 22 వేల 424 మంది శివ స్వాములు ఉన్నారు.

ఫిబ్రవరి 11న మధ్యాహ్నం ఒక గంట వరకు సుమారు 30 వేల 250 మంది దర్శించుకోగా 5 వేల 480 మంది శివ స్వాములు ఉన్నారు.

భక్తులు తొందరపడకుండా సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలు అనుసరించాలని జిల్లా పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మకూడదని తెలిపారు. పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని మాత్రమే సమాచారం పంచుకోవాలని సూచించారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు బ్రహ్మోత్సవాలు సాఫీగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Scroll to Top