శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 27 :

నంద్యాల పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్‌ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బైరమల్ స్ట్రీట్ అమ్మవారి శాల సమీపంలో అయ్యప్ప స్వీట్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఫయాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం బస్టాండ్ సమీపంలోని ప్రసిద్ధ ఆంజనేయస్వామి దేవస్థానంలో జరిగిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో ఫయాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎండి ఫయాజ్ మాట్లాడుతూ శ్రీరామచంద్రుని ఆశీస్సులు నంద్యాల ప్రజలందరిపై ఉండాలని, పట్టణం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవడం మన భారతీయ సంస్కృతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, ఉప్పరి కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్, అనుపూర్ ఈశ్వర్ , బింగుమల్లె శ్యామ్ సుందర్ గుప్తా, జాకీర్ మరియు ఆంజనేయ దేవస్థానం చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, మాజీ కౌన్సిలర్ వాకా శివశంకర్ యాదవ్ , వాకా వరప్రసాద్ యాదవ్ స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top