శిల్పా మోహన్ రెడ్డిని కలిసిన బొల్లెద్దుల రవి కుమార్

రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 21 :

నంద్యాల పట్టణానికి విచ్చేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బొల్లెద్దుల రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.  ఇటీవల తనకు వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పదవిని అప్పగించినందుకు శిల్పా మోహన్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ పార్టీ పట్ల తన నిబద్ధతతో మరింత చురుకుగా పనిచేస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు.

మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ..రవి కుమార్ పార్టీకి విశ్వసనీయంగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీకి మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top