- మంత్రి ఫరూక్ ముఖ్యఅతిథిగా కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు
• అమరావతి ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది – మంత్రి ఫరూక్
• అమరావతి రాజధాని చట్ట బద్ధత పై హర్షం వ్యక్తం చేసిన చిన్న, వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం
• వీధి వ్యాపారస్తుల సంక్షేమానికి, వారి జీవనోపాధి సంరక్షణకు సహకరిస్తాం: మంత్రి ఫరూక్





సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 05 :
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కి పార్లమెంటులో చట్టబద్ధత చేసిన సందర్భంగా నంద్యాల జిల్లా వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎమ్.డి. ఫరూక్ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.
మంత్రి ఫరూక్ కేక్ కట్ చేశారు. విధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం తరఫున మంత్రి ఫరూక్ ను సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు మహబూబ్ బాషా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తెలుగు ప్రజలు గర్వించే స్థాయిలో కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందని, అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వేగవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారని అన్నారు.
నంద్యాల జిల్లా వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలమైన ప్రదేశంలో అమరావతి మహా నగరాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూనుకోవడం ఆయన దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అమరావతి రాజధానికి మద్దతు పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తున్నదని తెలిపారు.
జిల్లా వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మహబూబ్ బాషా, కార్యదర్శి చిన్న మాతంగి ఉమా మహేష్ తదితరులు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసం సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కృషిచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యామంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు.
వీధి వ్యాపారస్తుల సంక్షేమానికి ,వారి జీవనోపాధి సంరక్షణకు సహకరిస్తాం: మంత్రి ఫరూక్
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం తరపున “కేంద్ర వీధి వ్యాపారస్తుల జీవనోపాధి సంరక్షణ చట్టం 2014” అనుగుణంగా వీధి వ్యాపారుల సంక్షేమానికి సహకరించాలని మంత్రి ఫరూక్ కు వినతిపత్రం సమర్పించారు. మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కేంద్ర చట్టం అనుగుణంగా టౌన్ వెండింగ్ కమిటీని ఏర్పాటు చేసి వీధి వ్యాపారస్తుల జీవనోపాధి సంరక్షణ కోసం, వారి సంక్షేమం కోసం సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఉపాధ్యక్షులు మద్దినేని వెంకటరమణ, అజీజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి చిన్న మాతంగి ఉమా మహేష్, కోశాధికారి అలీమ్, సంయుక్త కార్యదర్శి షేక్ ఖాజా హుస్సేన్, పిచ్చుక లోకేష్, అధిక సంఖ్యలో వీధి వ్యాపారస్తులు పాల్గొన్నారు.
