రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి 20,45,000/-రూపాయల చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 06 :

నంద్యాల జిల్లా నందికొట్కూరు సర్కిల్ ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్  యం. నాగేష్ ఉద్యోగ నిర్వహణలో ఉంటూ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

సదరు పోలీస్  కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అండగా ఉంటుందన్నదానికి నిదర్శనంగా పోలీస్ చీఫ్ ఆఫీసు నుండి రావలసిన బెనిఫిట్స్ ను ఉన్నతాధికారులతో మాట్లాడి మృతుడు రెండవ కుమారునికి జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 20,45,000/-రూపాయల చెక్కును అందించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, నాగేష్ కుటుంబానికి రావలసిన మరిన్ని బెనిఫిట్స్ ను త్వరగా అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. మృతుడి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.

Scroll to Top