రైతు సేవా కేంద్రాలను సందర్శించిన వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 20 :

నంద్యాల మండలములోని రాయమల్పురం మరియు  భీమవరం గ్రామములలోనీ రైతు సేవా కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు సందర్శించి రైతు విశిష్ట సంఖ్యకు సంబంధించిన నమోదు ప్రక్రియను మరియు వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న సాంకేతిక అంశాలైన డ్రోన్ ఆప్ మరియు రైతు ఆప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మండలంలో భూమి కలిగిన రైతులు అందరూ ప్రభుత్వం ద్వారా ఇస్తున్న రైతు కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని ఇందుకు గాను వారి గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు. రాబోయే కాలంలో ఈ రైతు కార్డు కలిగిన వారికి వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలు వర్తింపచేయబడునని , కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే రైతులు అందరూ డ్రోన్ కు సంబంధించిన ఆప్ ను వారి మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని, దీని ద్వారా వారి పంటలకు పిచికారి చేసుకొనుటకు క్యాబు బుకింగ్ తరహాలో డ్రోన్ బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే రైతు ఆప్ ద్వారా వ్యవసాయ శాఖ కు సంధించిన వివిధ విషయాలు తెలుసుకోగలరని, ఇందుకుగాను రైతు ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ విధంగా వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ సాంకేతిక అంశాలను రైతులు వినియోగించుకొని వ్యవసాయాన్ని లాభ సాటిగా చేసుకోవాలని తెలిపారు.

Scroll to Top