రైతు కార్డు నమోదు తప్పనిసరి

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 12 :

నంద్యాల మండలంలోని పుసులూరు, మిట్నాల గ్రామాల రైతు సేవా కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు సందర్శించి రైతు విశిష్ట సంఖ్య నమోదు ప్రక్రియను, డ్రోన్ ఆప్ మరియు రైతు ఆప్ రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని భూమి కలిగిన ప్రతి రైతు ప్రభుత్వం జారీ చేసే రైతు కార్డు తప్పనిసరిగా పొందాలని సూచించారు. గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. రాబోయే కాలంలో వ్యవసాయ శాఖ అమలు చేసే పథకాలు రైతు కార్డు కలిగిన వారికి మాత్రమే వర్తింపజేయబడతాయని స్పష్టం చేశారు.

రైతులు డ్రోన్ ఆప్‌ను మొబైల్‌లో డౌన్లోడ్ చేసి పంటల పిచికారీ కోసం డ్రోన్ బుకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. అలాగే రైతు ఆప్ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. సాంకేతిక సేవలను ఉపయోగించుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రైతులకు సూచించారు.

కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి బాల లింగమయ్య, వ్యవసాయ సహాయకులు మహేంద్ర, షంషీర్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Scroll to Top