

సత్యం వార్త / నంద్యాల /జనవరి 6 :
రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (రూట) నూతన 2026 క్యాలెండర్ ను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల క్యాంపు కార్యాలయం నందు ఆవిష్కరించడం జరిగింది మరియు వెలుగోడు మండల లో 30 వేలకు పైగా మైనార్టీ పాపులేషన్ కలదు అని ఆ ప్రాంతంలో ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని సంఘం తరపున ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది అక్కడ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తే పదోతరగతి తర్వాత డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గించి ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి వీలు ఉంటుందని మంత్రి ఫరూక్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మంత్రివర్యులు ఫరూక్ సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడ కాలేజ్ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉర్దూ డిఐ అసముద్దీన్, రూట నంద్యాల జిల్లా అధ్యక్షులు సైఫుల్ల, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ దస్తగిరి బాషా ,రాష్ట్ర మరియు ఆల్మండ్ నాయకులు జానీ బాషా, యూనుస్ బాషా, అఫ్జల్ బాషా,నూరుల్లా, మస్తాన్వలి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
