దంతాలు ఆరోగ్యంగా ఉంటే.. రోగాలు దరిచేరవు

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 13 :
దంతాలు ఆరోగ్యంగా ఉంటే రోగాలు దరిచేరవు అని వైద్యులు గురుప్రసాద్,సుజాత,కావ్య పేర్కొన్నారు.
ఎన్జీవోస్ కాలనీ జేవిఆర్ నగర్ హౌసింగ్ బోర్డ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆపోజిట్ హోమ్ శాంతి బోర్డు ఎదురుగా ఫంక్షన్ హాల్ నందు రమణి దంత వైద్యశాల వారి సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరమును ఏర్పాటు చేశారు. ఈ శిబిరములో డాక్టర్ గురు ప్రసాద్ , డాక్టర్ సుజాత , డాక్టర్ కావ్య వైద్యసేవలు చేశారు. ఉచిత వైద్య శిబిరంకు వచ్చిన రోగులకు వైద్యులు మంచిగా దంత పరిశీలన చేసి వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించారు. అవసరమైన వారికి ఆపరేషన్ కు 20% డిస్కౌంటీ ఇస్తామని పేర్కొన్నారు. ఏదైనా చిన్న చిన్న దంత సమస్యలు ఉన్నవారికి అక్కడే ట్రీట్మెంట్ చేసి ఉచిత మందులు అందించారు. ఈ ఉచిత శిబిరము లో హౌసింగ్ బోర్డ్ సొసైటీ అధ్యక్షులు కే నారాయణ ఉపాధ్యక్షులు తోట. రామయ్య సెక్రెటరీ కరీముల్లా గారు డైరెక్టర్స్ నీలి చంద్రశేఖర్ మాజీ సెక్రటరీ భాస్కరు మేనేజర్ రమణ మాజీ డైరెక్టర్ మల్లేష్, మొదలు వారు పాల్గొన్నారు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.
