మహిళలు నేరాలపై భయపడకుండా ఫిర్యాదు చేయాలి – సీఐ గౌతమి

నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మరియు సైబర్ క్రైమ్ ఇన్‌చార్జి గౌతమి శుక్రవారం పాణ్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 20 :

ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల కోసం “ఆన్‌లైన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ ఉమెన్” పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మహిళల వ్యక్తిగత భద్రత,సైబర్ నేరాల నివారణ,డిజిటల్ జాగ్రత్తలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా సీఐ గౌతమి మాట్లాడుతూ..

సోషల్ మీడియా వేదికల దుర్వినియోగం,ఫేక్ ప్రొఫైల్స్,ఫిషింగ్ లింకులు,ఆన్‌లైన్ మోసాలు,సైబర్ స్టాకింగ్ వంటి నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు..

..అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని,వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని,బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని సూచించారు..

..సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడం లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు..

అలాగే హైదరాబాద్ నీలిట్ డైరెక్టర్ డాక్టర్ కొర్ర లక్ష్మణ్ మాట్లాడుతూ..సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులు,సురక్షిత వాతావరణం సృష్టించడం,ఆన్‌లైన్ ప్రవర్తనలో జాగ్రత్తలు,సైబర్ హైజీన్ వంటి అంశాలపై ప్రదర్శనతో కూడిన వివరణ ఇచ్చారు..ముఖ్యంగా విద్యార్థినులు తమ డిజిటల్ ఫుట్‌ప్రింట్‌పై అవగాహన కలిగి ఉండాలని,సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్ సరిచేసుకోవాలని సూచించారు..

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ అశోక్ కుమార్,డాక్టర్ రామిరెడ్డి,హెచ్‌.ఓ.డీ డాక్టర్ సుబ్బారెడ్డి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు..విద్యార్థినులు సందేహాలను నివృత్తి చేసుకుంటూ చురుకుగా పాల్గొన్నారు..

కార్యక్రమం ముగింపులో మహిళలు తమ హక్కులను తెలుసుకుని ధైర్యంగా ముందుకు రావాలని,సైబర్ నేరాల నిర్మూలనలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు.. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని విద్యాసంస్థల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Scroll to Top