
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 08 :
మహాశివరాత్రి పండుగ సందర్భముగా, ఆత్మకూరు నుండి దోర్నాల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ ను నియంత్రించుట కొరకు, 09.02.2026 వ తేదీ నుండి కర్నూలు నుండి విజయవాడ వైపు వెళ్ళు భారీ గూడ్స్ వాహనములను దోర్నాల మీదుగా అనుమతించబడవు. సదరు భారీ వాహనములు నంద్యాల మీదుగా వెల్లవలెను. అదే విధముగా విజయవాడ నుండి కర్నూలు వైపు వచ్చే భారీ గూడ్స్ వాహనములు దోర్నాల – ఆత్మకూరు మీదుగా అనుమతించబడవు. సదరు వాహనములు గిద్దలూరు, నంద్యాల మీదుగా వెల్లవలెను…
శ్రీశైలంకు కాలినడకన వెళ్ళు భక్తులు రోడ్డుకు ఒక వైపున మాత్రమే వెల్లవలెను…
పాదచారులు జేబుదొంగల పట్ల అప్రమత్తముగా ఉంటూ, వారి యొక్క వస్తువులను మరియు లాగేజీ ని జాగ్రత్త చూసుకొనవలెను…
గూడ్స్ వాహనముల యందు మనుషులు అనుమతించబడరు మరియు వాహనాల యందు ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణించరాదు…
వాహన దారులు నిర్దేశించిన వేగముతో వెల్లవలెను. అతివేగముతో ప్రయాణించరాదు…
వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, పోలీసు వారికి సహకరించవలెను. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిచిన యెడల మోటార్ వాహనాల చట్టప్రకారం చర్య తీసుకొనబడును…
వాహన డ్రైవరు లు మద్యం సేవించి వాహనాలను నడపరాదు…
వెంకటాపురం వరకు వాహనములలో వచ్చి, కాలినడకన వెళ్ళు భక్తులు, వారి యొక్క వాహనములను రోడ్డు పై ఎక్కడ పడితే అక్కడ నిలిపి వేయకుండా, వెంకటాపురం వద్ద వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశం నందు ఒక క్రమపద్దతిలో పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా పోలీసు వారికి సహకరించవలెను…
చిన్నపిల్లలతో పాటు కాలినడకన వెళ్ళే వారు, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉంటూ, వారు తప్పిపోకుండా చూసుకోవలెను…
భక్తులు అడవిలో ప్రయాణించేటప్పుడు అటవీ పరిసరాలకు ఎటువంటి హాని తలపెట్టరాడు…
భక్తులు అటవీ మార్గములో ప్రయాణించేటపుడు వన్య ప్రాణులకు హాని తలపెట్టకుండా, జంతువుల నుండి అప్రమత్తముగా ఉండవలెను…
అటవీ మార్గములో ప్లాస్టిక్ వస్తువులు అనుమతించబడవు.
