బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన పసుపు వర్ణ ఆక్టివిటీ

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 30 :

నంద్యాల జిల్లాలోని పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాల నందు పసుపు కలర్ ఆక్టివిటీని పాఠశాల చిన్నారులు మరియు ఉపాధ్యాయ బృందం ఎంతో ఆసక్తికరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు పసుపు వర్ణము దుస్తులు ధరించి పసుపు కలర్ వస్తువులు మరియు ఆహార పదార్థాలతో ఎంతో ఉత్సాహంగా పసుపువర్ణ ఆక్టివిటీని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ పసుపు వర్ణం శుభానికి సూచన అని తాజాదనానికి సంతోషానికి పాజిటివిటీగా,క్లారిటీగా శక్తివంతంగా, ఉత్సాహవంతంగా, నీతికి, నిజాయితీకి సూచకమని తెలిపారు. ఈ కలర్ ఆహార పదార్థాలు పిల్లలను ఎంతో ఆకర్షించడం ,చిన్నపిల్లల పడక గదిలో కూడా పిల్లలకి పాజిటివ్ తరంగాలను పడేలా పసుపు రంగు కలర్ గోడలకు పూస్తారు. ఇంత విశిష్టత కలిగిన పసుపు వర్ణం రోజున జరుపుకోవడం ఎంతో ఆనందకరమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ ప్రిన్సిపాల్ మాధవీలత విద్యార్థినీ,విద్యార్థులు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Scroll to Top