


సత్యం వార్త / నంద్యాల / జనవరి 24 :
నంద్యాల జిల్లాలోని పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాల యందు 24వ తేదీ అనగా శనివారము ఎరుపువర్ణం ఆక్టివిటీని పాఠశాల చిన్నారులు మరియు ఉపాధ్యాయ బృందం ఎంతో ఆసక్తికరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు ఎరుపువర్ణం దుస్తులు ధరించి,ఎరుపువర్ణపు వస్తువులు మరియు ఆహార పదార్థాలతో ఎంతో ఉత్సాహంగా ఎరుపు వర్ణ ఆక్టివిటీని జరుపుకోవడం జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎం.జి.వి.రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ ఎరుపు వర్ణం చారిత్రాత్మకంగా ధైర్యం, త్యాగం, ప్రమాదం లతో ముడిపడి ఉంటుంది. ఆనందాన్ని మరియు అదృష్టాన్ని సూచిస్తుంది ఆధునిక సర్వేల ప్రకారం ఈ ఎరుపువర్ణము వేడిని, కార్యాచరణను, అభిరుచిని, కోపం మరియు ప్రేమతో సంబంధం ఉన్నాయి అని తెలుస్తుంది ఇంత విశిష్టత కలిగిన ఎరుపువర్ణం రోజును జరుపుకోవడం ఎంతో ఆనందకరమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత విద్యార్థినీ,విద్యార్థులు మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
