ప్రథమ నందీశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ చలంబాబు సేవలు అభినందనీయం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 11 : ప్రథమ నందీశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ చలంబాబును ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఘనంగా సన్మానించారు. నంద్యాల పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చలంబాబు చేస్తున్న దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక సేవలను రాష్ట్ర నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు మాట్లాడుతూ, చలంబాబు దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆలయ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని, భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఇటువంటి సేవాభావంతో పనిచేసే నాయకులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. అనంతరం నంద్యాల పట్టణ ఏపీ యూడబ్ల్యూజే నూతన కమిటీ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావును సన్మానించారు. అదే విధంగా చలంబాబును కూడా ఘనంగా సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, నంద్యాల పట్టణ నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top