

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి /జనవరి 6 : పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన వైస్సార్సీపీ మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి,శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి,ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతరెడ్డి,శివరామిరెడ్డి,జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి,సమన్వయ కర్త డా”సుదీర్ దారా.
చంద్రబాబు చీకటి ఒప్పందంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డికి అప్పజెప్పారు, రాయలసీమలోని నాలుగు జిల్లాలను వెనుకబాటు నుండి గట్టు ఏక్కించాలని ఉద్దేశ్యం 2020 లో జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు, 3207 కోట్ల వ్యయంతో రాయలసీమ పథకాన్ని శ్రీకారం చుట్టారు జగన్, దాదాపు 40% పనులు పూర్తి మా ప్రభుత్వ హయాంలో పూర్తి కానీ మిగిలిన పనులను ఈ చంద్రబాబు పూర్తి చేయలేక తెలంగాణకు ఈ రాయలసీమ లిఫ్ట్ తాకట్టు పెట్టారు చంద్రబాబు.
