పేద విద్యార్థులకు అండగా వరల్డ్ విజన్ ఇండియా స్వచ్ఛంద సంస్థ – మంత్రి ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 15 :
నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ‘వరల్డ్ విజన్ ఇండియా’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై, సంస్థ గుర్తించిన విద్యార్థులకు స్వయంగా ప్లేట్లను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, 2019లో స్థాపించబడిన వరల్డ్ విజన్ ఇండియా సంస్థ సమాజంలో విద్య, ఆరోగ్యం మరియు బాలల భద్రత కోసం విశేష కృషి చేస్తుందన్నారు. ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా 15 గ్రామాలలో మొత్తం 2040 మంది పేద విద్యార్థులకు ప్లేట్లను పంపిణీ చేయడం మంచి శుభ పరిణామం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మరిన్ని ముందుకు వచ్చి పేద ప్రజలకు, విద్యార్థులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో వరల్డ్ విజన్ ఇండియా ఆఫీసర్ తిరుపతిరావు , ప్రోగ్రాం కోఆర్డినేటర్లు జేసి, రవికుమార్ లతో పాటు టిడిపి నాయకులు, అయ్యలూరు మాజీ సర్పంచ్ త్రిలింగేశ్వర్ రెడ్డి, మునగాల విశ్వనాథరెడ్డి, కామిని మల్లికార్జున, చంద్రశేఖర్ రెడ్డి మరియు సంస్థ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top