

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మే 02 :
నంద్యాల… ఇటీవల విడుదలైన 2026 ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి (ఎస్.ఎస్.సి) పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో నంద్యాల పట్టణం 33 వ వార్డు టీడీపి ఇంచార్జి జోసఫ్ కుమార్తె అశ్రిత జెరూషా అసాధారణ ప్రతిభ కనబరిచారు. మొత్తం 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి, ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నంద్యాలలోని మంత్రి గారి క్యాంప్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , నంద్యాల జిల్లా టీడీపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అశ్రిత జెరూషాను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి, పట్టుదలతో చదివి 594 మార్కులు సాధించడం అభినందనీయం అని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అశ్రిత నిరూపించిందని తెలిపారు . భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించి, తల్లిదండ్రులకు, నంద్యాల పట్టణానికి మంచి పేరు తీసుకొనిరావాలన్నారు
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ అశ్రిత జెరూషా ను అభినందిస్తూ, ఆమె ఉన్నత చదువులకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. తమ కుమార్తె విజయం పట్ల తండ్రి జోసఫ్ మరియు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి ఫరూక్ గారికి మరియు ఫిరోజ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ పాల్గొన్నారు
నంద్యాలలో ప్రతిభ కనబరిచిన ప్రవేట్ స్కూల్ విద్యార్థులకు అభినందనల వెల్లువ
విద్యార్థులను ఘనంగా సన్మానించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ‘స్కూల్ టాపర్స్’గా నిలిచిన విద్యార్థులను నంద్యాల మంత్రి గారి క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గార్లు ఘనంగా శాలువాలు కప్పి విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలైన రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ , ఎన్జీవోస్ కాలనీ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ , వికాస్ స్కూల్ , నలంద స్కూల్ , నవభారత్ స్కూల్ , జి.వి.ఆర్. అభ్యుదయ స్కూల్ , స్వామి వివేకానంద స్కూల్ , నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
మరియు ఇతర పాఠశాలల టాపర్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా విద్యా రంగంలో ముందంజలో ఉండటం గర్వకారణమని, విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో కీలకమని కొనియాడారు.
ఈ అభినందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా అపస్మా ప్రెసిడెంట్ బీజ్జం సుబ్బారెడ్డి , జిల్లా ట్రెజరర్ హుస్సేన్ భాష , జిల్లా ఉపాధ్యక్షులు వికాస్ వలి , టౌన్ గౌరవాధ్యక్షులు ఇషాక్ వలి , ఖాజా హుస్సేన్, ఉత్తేజ్, జి.వి.ఆర్. అభ్యుదయ వలి, రవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల సిబ్బంది మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
