

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 17 :
నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న “మసీద్ – ఎ – షెహనాజ్” ను నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మసీదు నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించి, పనుల పురోగతి గురించి కమిటీ సభ్యులను మరియు నిర్మాణ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ మా అమ్మ పేరు మీద మసీదును నిర్మించడం చాలా సంతోషంగా ఉందని , మసీదు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మసీదు అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఫిరోజ్ తెలిపారు .
ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల టిడిపి నాయకులు హుస్సేన్ , మనోజ్ , మాజీ ఎంపీటీసీ హుస్సేనయ్య, వెంకటయ్య, రహీమ్, మాలి, చంద్ర, అక్బర్, సైలాబ్ మరియు మసీదు కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
