నంద్యాల మంత్రి ఫరూక్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర 2026 వేడుకలు

నంద్యాల జిల్లా / జనవరి 01- 2026 / సత్యం వార్త ప్రతినిధి :

నంద్యాల పట్టణంలోని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయం గురువారం నూతన సంవత్సర వేడుకలతో సందడిగా మారింది. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలు, టిడిపి నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకల్లో భాగంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో పాటు, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ని, నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని అభిమానులు, కార్యకర్తలు కలిసి పూలమాలలు, శాలువాలు, నోటి పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కొత్త ఏడాదిలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు పాల్గొనడంతో క్యాంపు కార్యాలయం జనసందోహంగా మారింది.

Scroll to Top