

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 27:
నేర నియంత్రణకు మరియు ప్రభుత్వాన్ని నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మరియు రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటకు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో తనిఖీ చేయుచున్న సందర్భంగా జిల్లా ఎస్పీ సదరు కార్యక్రమంలో పాల్గొని వాహనాలు తనిఖీ చేయడంతో పాటు మోటార్ సైకిల్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల సూచనలు పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అనంతరం అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్న పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏ ఎస్పీ ఎం.జావళి ఐపీఎస్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య సబ్ ఇన్స్పెక్టర్ గంగయ్య యాదవ్ పాల్గొన్నారు.
