


వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుగంధర్ బాబు
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / జనవరి 19 :
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునిల్ షోరాణ్ IPS ఆదేశాలమేరకు ప్రజా కవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి వేడుకలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుఘంధర్ బాబు ఆద్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వేమన చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ వేమన తన పద్యాల ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలి, మానవతా విలువలను చాటిచెప్పారని కొనియాడారు.సామాన్యులకు అర్థం చేసుకునే విధంగా సరళమైన భాషలో గంభీరమైన జీవిత సత్యాలను బోధించిన గొప్ప దార్శనికుడనీ, సమాజంలోని మూఢాచారాలను నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా వేమన అని గుర్తుచేశారు.వేమన అందించిన సందేశాలు నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ N. యుగంధర్ బాబు తో పాటు సాయుధ బలగాల డిఎస్పి శ్రీనివాసులు రిజర్వు ఇన్స్పెక్టర్ మంజునాథ్ , RSI హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొని యోగి వేమన కి నివాళులర్పించారు.
