

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా , మహిళలు మరియు చిన్నపిల్లలపై జరిగే నేరాలపై అవగాహన…
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా…
నంద్యాల జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని జిల్లా పోలీసు అధికారులకు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న పోలీసు అధికారులు వాహన తనిఖీలు, రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు ,సమాజంలో ప్రస్తుతం జరిగే నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరిగింది.
మహిళల భద్రత, సురక్షిత జీవనం లక్ష్యంగా “శక్తి” మొబైల్ యాప్ పై అవగాహన కల్పించారు,ఈ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఒక్క క్లిక్‌తో పోలీసులకు సమాచారాన్ని అందించవచ్చు,ఇది 24/7 అందుబాటులో ఉంటుంది.అత్యవసర సమయంలో 🆘 బటన్ నొక్కగానే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లి, ఆపదలో వున్నవారు రక్షించబడతారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు.కార్ల డ్రైవర్లు సీటు బెల్టు వేసుకోవాలన్నారు.
సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగులకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి.
పరిమితికి మించి ప్రయాణీకులను ఆటోలలో తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాల్లో, లే-అవుట్లు, గ్రామ/ పట్టణ శివారు ప్రాంతాల్లోను, మద్యం సేవించి, న్యూసెన్సు చేస్తూన్న వారిపై పోలీసు అధికారులు డ్రోన్లతో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగింది.
