






సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 21 :
నంద్యాల పట్టణంలోని భీమవరం రాస్తాలో ఉన్న అల్పూర్ ఖాన్ ఈద్గా మైదానంలో పవిత్ర రంజాన్ పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. నెల రోజుల పాటు నిష్టతో పాటించిన ఉపవాస దీక్షలు విరమించి, ముస్లిం సోదరులందరూ ఈద్గా వద్ద ప్రత్యేక ఈద్ నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు సోదరభావానికి ప్రతీక అని అన్నారు. నంద్యాల జిల్లా ప్రజలందరూ కులమతాలకు అతీతంగా, ఐకమత్యంతో సుఖసంతోషాలతో, శాంతి సమృద్ధులతో వర్ధిల్లాలని అల్లాహ్ను ప్రార్థించినట్లు తెలిపారు. నమాజ్ అనంతరం అక్కడకు చేరుకున్న ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని, పరస్పరం “ఈద్ ముబారక్” తెలుపుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , స్థానిక ముస్లిం మత పెద్దలు, యువకులు మరియు భారీ సంఖ్యలో మైనారిటీ ప్రజలు పాల్గొన్నారు.
