



రాష్ట్ర మంత్రి ఎన్. ఎం.డి.ఫరూక్ చొరవతో ప్రత్యేక గ్రాంట్ కింద 100 కోట్లతో అభివృద్ధి
126 ఏళ్ల మున్సిపల్ చరిత్రలో 102 కోట్ల బడ్జెట్ పై ప్రశంసల జల్లులు
టౌన్ ప్లానింగ్,రెవెన్యూ అధికారుల కృషి ప్రశంసనీయం
ప్రజలు,వ్యాపారులు పన్నులు చెల్లించి ,అభివృద్ధికి సహకరించండి.
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 10 :
నంద్యాల మున్సిపల్ 126 చరిత్రలో రూ 102 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో ప్రశంశల జల్లులు కురిపించారు. రాష్ట్ర మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ చొరవతో రానున్న కాలంలో మరో 100 కోట్లతో నంద్యాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు రానున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ లో మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా ఆధ్వర్యంలో 2026-27 బడ్జెట్ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ లో 2024-25,2025-26,2026-27 కు సంబంధించిన అంచనాలు ఆదాయ వనరులు,రెవెన్యూ రాబడులు, మూల ధనం రాబడులు ఖర్చులు,మిగులుపై కౌన్సిల్ సభ్యులకు,ప్రజలకు వివరంగా బడ్జెట్ సారాంశాన్ని వివరించారు. బడ్జెట్ లో రూ 102 కోట్లు ప్రవేశపెట్టడంతో హర్షధ్వానాల మధ్య ప్రశంశల జల్లులు కురిపించారు.టీడీపీ,వైసిపి సబ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పామ్ షా వలి,కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్,కో అప్షన్ సబ్యులు పడకండ్ల సుబ్రమణ్యం,సబ్యులు హర్షం వ్యక్తం చేస్తూ నంద్యాల మున్సిపల్ చరిత్రలో 102 కోట్ల బడ్జెట్ రూపొందించడం తో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు.ప్రధానంగా రోడ్లు,కాల్వలు,శానిటేషన్‌కు అధికంగా నిధులు ఖర్చు పెట్టడానికి తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం అన్నారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ కౌన్సిల్ సబ్యులు,అధికారుల సహాయ సహకారాలతో 102 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం సాధ్యం అయిందన్నారు.బడ్జెట్ నిధులతో అభివృద్ధిలో నంద్యాల ను మొదటి స్థానానికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని అన్నారు.గతంలో మున్సిపల్ కౌన్సిల్ లో అభివృద్ధికి 72 కోట్లు ప్రవేశ పెట్టామన్నారు.అధికారులు,కౌన్సిల్ సభ్యుల కృషితోనే ఇంత పెద్ద బడ్జెట్ రూపొందించామన్నారు.నంద్యాల అభివృద్ధికి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్.ఎం.డి.ఫరూక్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో రానున్న కాలంలో 100 కోట్ల ప్రత్యేక నిధులు వస్తున్నాయని పేర్కొన్నారు.ప్రధానంగా మున్సిపల్ ఆదాయానికి మూల స్తంభాలైనా రెవెన్యూ,టౌన్ ప్లానింగ్ అధికారుల కృషితోనే సాధించామని ప్రశంసించారు.రెవెన్యూ ఆదాయం 64 కోట్లు,మూలధనం 38 కోట్లు వసూలు చేయడంతోనే బడ్జెట్ సాధించామని అన్నారు. రెవెన్యూ,టౌన్ ప్లానింగ్ అధికారుల కృషి నంద్యాల అభివృద్ధికి పాటు బడుతుందన్నారు.భవిషత్తులో 42 వార్డుల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేసేవిదంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.మార్చిలో పన్నుల వసూళ్లు అనంతరం నంద్యాల మున్సిపాలిటీకి వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.నంద్యాల అభివృద్ధి చెందాలంటే ఇంటి పన్నులు,కొళాయి పన్నులు,ఖాళీ స్థలాల పన్నులు,టైటిల్ ట్రాన్స్ఫర్,మ్యుటేషన్ ,ట్రేడ్ లైసెన్స్ ఫీజులు,మున్సిపల్ దుకాణాల బాడుగలు ప్రజలు,వ్యాపారులు సకాలంలో చెల్లిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు.ప్రభుత్వం బి.పి.ఎస్.,ఎల్ అర్ ఎస్ పథకాలను ప్రజలు ఉపయోగించుకుంటే మున్సిపల్ ఆదాయం మరింత పెరుగుతుందని అన్నారు.ఇంటి యజమానులు,దుకాణాల యజమానులు సమస్యలు లేకుండా ప్రభుత్వం అందిస్తున్న వేషాలు బాటు ను సద్వినియోగం చేసుకొని నంద్యాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.భవిష్యత్తులో నంద్యాల అభివృద్ధిలో మొదటి స్థానం వచ్చే విధంగా అందరము కృషిచెద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
