నంద్యాలలో సిపిఐ ఆధ్వర్యంలో “యుద్ధం వద్దు… శాంతి ముద్దు” నినాదంతో నంద్యాలలో క్యాండిల్ ర్యాలీ

అమెరికా యుద్ధ విధానాలకు వ్యతిరేకంగా నంద్యాలలో సిపిఐ ఆధ్వర్యంలో “యుద్ధం వద్దు… శాంతి ముద్దు” నినాదంతో నంద్యాలలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడుతూ అమెరికా చిన్న దేశాలను యుద్ధాల్లోకి నెట్టుతూ ఆయుధాలు అమ్ముకుంటుందని విమర్శించారు. ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలకు దారితీస్తోందని, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి సుంకయ్య, శ్రీనివాసులు, రాధాకృష్ణ, భార్గవ్, సోమన్న, లక్ష్మీదేవి తదితర నాయకులు, మహిళా సంఘ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top