

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 18 :
శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతినెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో ఓం శరవణ బావ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సేవ కార్యక్రమం కొనసాగుతోంది.
నంద్యాల బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పక్కన చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఈ అన్నదాన కార్యక్రమం ప్రతినెలా అమావాస్య రోజు నిర్వహిస్తున్నారు. సురేష్ ఆధ్వర్యంలో, మిత్రబృందం సహకారంతో ఈ సేవా కార్యక్రమం సాఫల్యంగా కొనసాగుతోంది. భక్తుల సహకారం, దాతల ప్రోత్సాహంతో కార్యక్రమం మరింత విస్తృతంగా నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్స్ కౌన్సిలర్ కన్నమ్మ, న్యూ బాట మహేష్, ప్రదీప్ (మెట్రో సెల్ పాయింట్), సీఎం నారాయణ, నందవరం గణ మద్దిలేటి, బయటిపేట చిరంజీవి, బిల్లా లాపురం రాజు, పీఎం అశోక్, గద్వాల మహానంది, గద్వాల సుబ్బు తదితర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని అభినందించారు.
అలాగే చౌడేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యులు, ధర్మకర్త శ్రీనివాస్, పి. వాసు, ఆది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీకరించారు.
సేవ భావంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరింత విస్తరించి, అవసరమైన వారికి సహాయం అందించాలనే లక్ష్యంతో నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు.
