



ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, మాజీ ఎమ్మెల్యే భూమా
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 17:
నంద్యాల 40 వార్డ్ చిన్న ఆస్పత్రి దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ , నంద్యాల టౌన్ ప్రెసిడెంట్ మునియార్ ఖలీల్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఖలీల్ అహ్మద్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఖలీల్ అహ్మద్ కు శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానుల సమక్షంలో 50 కేజీల భారీ కేకును కట్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన నాయకులు, అభిమానులు ఖలీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు, పార్టీ అభిమానులు , ఖలీల్ అహ్మద్ అనుచరులు తదితరులు పాల్గొన్నారు.
