నంద్యాలలో కేవలం ఒక్క రూపాయికే జొన్న రొట్టె,పప్పు ప్రారంభించిన గోళ్ళ రాజేష్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 12 :
సంక్రాంతి సందర్భంగా కేవలం ఒక్క రూపాయికే జొన్న రొట్టె,పప్పు.. ప్రారంభించారు ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక కార్యకర్త గోళ్ళ రాజేష్.. ఈ కార్యక్రమాన్ని టెక్కే మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయులు చిన్న హుస్సేన్ సాహెబ్ మొదటగా జొన్న రొట్టె పప్పును తన చేతుల మీదుగా ప్రజలకు అందించారు.. పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర సంఘమిత్ర బాలుర గృహం ప్రక్కన సలీం నగర్ వెళ్ళే మార్గ మధ్యలో ఏర్పాటు చేసిన పేద ప్రజల కోసం పేదల పెద్దన్నలా గోళ్ల రాజేష్ ఒక రూపాయికే పుల్కాలు,కర్రీ తో పాటు ఒక్క రూపాయికే వెజిటేబుల్ పలావ్,కర్రి ప్రజలకు నిరంతరాయంగా అందిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా కేవలం ఒక్క రూపాయికే జొన్న రొట్టె,పప్పు పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని టేక్కే మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయులు బీ.సి.హుస్సేన్ సాహెబ్ ప్రజలకు రొట్టె పప్పు ను అందించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బీ.సి. చిన్న హుస్సేన్ సాహెబ్ మాట్లాడుతూ గోళ్ళ రాజేష్ పేద ప్రజలందరికీ నిజంగానే పేదల పెద్దన్నగా ప్రజలందరికీ ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలు మరోవైపు కౌలు రైతులకు ఆర్థికంగా ఆదుకున్నారని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతినెల 2000 రూపాయలు ప్రకారం రెండు విడుతలు అందించడం చాలా గొప్ప కార్యక్రమం అని నిరుద్యోగ యువతకు ఆత్మ సైన్యాన్ని అందించి ప్రతినెల 2000 రూపాయలు అందించడం చాలా గొప్ప అభినందించ దగ్గా కార్యక్రమాలని ఈ సందర్భంగా గోళ్ళ రాజేష్ ని ఉపాధ్యాయులు చిన్న హుస్సేన్ సాహెబ్ అభినందించారు.
ఈ కార్యక్రమాన్ని గొళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల నిర్వాహకులు ఏపిడబ్ల్యూజే నంద్యాల ఉపాధ్యక్షులు సీనియర్ రిపోర్టర్ నూర్ భాష మాట్లాడుతూ నిజంగానే నంద్యాల ప్రజలకు గోళ్ళ రాజేష్ అన్న చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల వల్ల ప్రజలు గోళ్ళ రాజేష్ పై చాలా ప్రేమ అభిమానాలు కురిపిస్తున్నారని గోళ్ళ రాజేష్ పై ప్రశంసలు,అభినందనలు అందిస్తున్నారని వారిని ఆశీదిస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో కార్యనిర్వాహకులుగా తనకు అవకాశం ఇచ్చినందుకు తనది పూర్వజన్మ సుకృతం అని ఇలాంటి సేవా కార్యక్రమాలు తన ద్వారా ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తున్న గోళ్ళ రాజేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోళ్ళ రాజేష్ పై భగవంతుని ఆశీర్వచనాలు ఎల్లకాలం ఉండాలని అలాంటివారు ఎల్లకాలం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలు ఇలాంటి సేవ తత్పరులైన గోళ్ళ రాజేష్ పై ప్రజలు చూపిస్తున్న ఆధరభిమానాలు ఎల్ల కలం ఇలాగే ప్రేమనందించాలని గోళ్ళ రాజేష్ ప్రజలకు మరెన్నో సేవ కార్యక్రమాలు చేసేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలియజేసారు.

Scroll to Top