
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 07 :
దళారులను నమ్మి మోసపోవద్దని నంద్యాల అర్బన్ తాసిల్దార్ శ్రీనివాసులు ప్రజలను హెచ్చరించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని ఉన్నా నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. దళారుల ద్వారా పనులు చేయించుకోవాలని ప్రయత్నిస్తే ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా అనవసర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి మధ్యవర్తులను దూరంగా ఉంచుకోవాలని కోరారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని తాసిల్దార్ సూచించారు. అత్యవసర పనులు ఉంటే ఉదయం వేళల్లోనే పూర్తి చేసుకుని, మధ్యాహ్న వేళల్లో బయటకు రావడం తగ్గించాలని చెప్పారు. అవసరమైతే సాయంత్రం 5 గంటల తర్వాత పనులు చూసుకోవాలని సూచించారు.
