డిఎస్ హాజీ మహమ్మద్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు లో  పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 02 :

నంద్యాల పట్టణం మెయిన్ బజార్లోని హజరత్ సయ్యద్ షా జమాలుద్దీన్ భాష రహంతుల్లా అలైహి దర్గా అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం దర్గా ఎదురుగా డిఎస్ హాజీ మహమ్మద్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు పట్టణ టిడిపి అధ్యక్షులు మనియార్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం అభినందనీయమని, డీఎస్ రసూల్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం పుణ్యకార్యమన్నారు. డిఎస్ రసూల్ మాట్లాడుతూ డిఎస్ హాజీ మొహమ్మద్ హనీఫ్ సన్స్ ట్రస్టు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం తమ ట్రస్టు తరుపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు వ్యాపారస్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖాజా మొహిద్దిన్, హాజీ డిఎస్ జాఫర్ హుసేన్, జాహిద్, జాఫర్, రసూల్, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా, కో ఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రమణ్యం, జాకీర్, కౌన్సిలర్ సమద్, డిఎస్ మహబూబ్ భాష అండ్ బ్రదర్స్, డిఎస్ రసూల్ బ్రదర్స్, మౌలానా అబ్దుల్ సలాం,బులియన్ మర్చంట్ అసోసియేషన్ నాయకులు, దర్గా కమిటీ సభ్యులు, షేక్షా, యూనుస్, షేక్ సద్దాం, ఉమర్, పర్వేజ్, హుసేన్ బాషా, మహమ్మద్, మెహ్రోజ్ తో పాటు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top