జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నియంత్రణ సమన్వయ సమావేశం – నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్. యుగంధర్ బాబు

నంద్యాల జిల్లా / డిసెంబర్ 30 – 2025 / సత్యం వార్త ప్రతినిధి :
నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు (గంజా/డ్రగ్స్) సంబంధించి జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ సమన్వయ సమావేశం(ఎన్‌కార్డ్)ను నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్. యుగంధర్ బాబు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు నేడు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పోలీసు శాఖ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొని, డ్రగ్స్ నిర్మూలనపై సమన్వయ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

జిల్లాలో ఎన్‌డిపిఎస్ కేసులపై జీరో టాలరెన్స్ విధానం ను కఠినంగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయం, నిల్వపై ఎలాంటి సడలింపులు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో మరియు హాస్టల్ లలో ఈగిల్ క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుంది.

నిరంతరం జిల్లాలో వివిద ప్రాంతాలలో జిల్లా పోలీసు శాఖ ద్వారా CASO (కార్డన్ & సెర్చ్ ఆపరేషన్స్) నిర్వహించి అనుమానితుల ఇళ్ళలో సోదాలు నిర్వహించడం జరుగుతుంది.అంతేకాక నిర్మానుష్య ప్రాంతాలలో, బహిరంగ ప్రదేశాల్లో, తోటలో,మనుష్యులు వెళ్లలేని ప్రాంతాలలో డ్రగ్స్/మద్యం వినియోగంపై డ్రోన్ కేమరాల సహాయంతో నిఘా ఉంచి నిరంతరం పర్యవేక్షణ చెయ్యడం జరుగుతుంది.

సరిహద్దు చెక్ పోస్టుల బలోపేతం, వాహనాల తనిఖీలు నిర్వహించడం రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో అనుమానితుల తనిఖీలు చెయ్యడం జరుగుతుంది. పాత నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తు మళ్ళీ పునరావృత కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

అంతేకాక తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని వారు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చెడు మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు నిఘా ఉంచాలని తెలియజేశారు.

డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఇటీవల ఎన్‌డిపిఎస్ కేసుల్లో కీలక విజయాలు :

ఆత్మకూరు, డోన్, నంద్యాల పట్టణం, నందికొట్కూరు పరిధుల్లో గంజాయి అక్రమ రవాణాపై, ఓపెన్ డ్రింకింగ్ దాడులు నిర్వహించి కేసులు నమోదు చెయ్యడంతో పాటు

గంజాయి అక్రమ రవాణా ను అడ్డుకొని ముద్దాయిలను అరెస్టు చెయ్యడం మరియు కిలోల కొద్దీ గంజాయి, వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించడం జరిగింది.

డ్రగ్స్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తీవ్రమైన ముప్పు అని తెలియజేస్తూ జిల్లా అదికారులు వారి సిబ్బందితో కలిసి (విద్యార్థులు మరియు ప్రజలలో)సమాజంలో యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా కాపాడుకోవాలని మరియు ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972, క్యూఆర్ కోడ్ గురించి, అలాగే డ్రగ్స్ మరియు గంజాయి వలన కలిగే నష్టాల గురించి తెలియజెయ్యాలని,దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

“డ్రగ్స్ వద్దు – బ్రో” అనే నినాదంతో ప్రజలందరూ కలిసి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. డ్రగ్స్ సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గాని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1972 తెలియజేయాలని కోరారు.
డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల సహకారం అత్యంత కీలకం అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

Scroll to Top