జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 18 :

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ , యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో మార్చి 25 తేదీ స్థానిక ఎన్టీఆర్ షాది ఖానా నందు జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి , ప్లేస్మెంట్ ఆఫీసర్ సుబ్బన్న , స్కిల్ హబ్ కోఆర్డినేటర్ మస్తాన్ వలి తో కలిసి మంత్రి ఎన్ఎండి ఫరూక్ పోస్టర్లను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహించిన జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు . 13 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొనబోతున్నాయని . దాదాపు 920 పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు . నిరుద్యోగులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ప్రతి నెల జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు . 20 లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలలో ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ ఆశయమన్నారు . ఈ ఆశయానికి అనుగుణంగా మంత్రివర్యులు నారా లోకేష్ సారథ్యంలో ఖచ్చితంగా సాధిస్తామని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు అలాగే నాకు తెలిసిన హైదరాబాద్ కంపెనీస్ కూడా నంద్యాలకు తీసుకుని వచ్చి జాబ్ మేళా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Scroll to Top