ముఖ్యఅతిథిగా హాజరైన టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్





సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 18 :
నంద్యాల పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆదేశాల మేరకు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రా రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ సభ్యులు:
శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం చైర్మన్ గా బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య
సభ్యులు: వసుంధర దేవి, లక్ష్మణ్ సింగ్, రాజ్ పురోహిత్ బాబు సింగ్, పురోహితులు సుబ్రమణ్య శాస్త్రి, లక్ష్మీ బాయి, వరలక్ష్మి, విజయభాస్కర్, భారతి, సుబ్రమణ్యం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమమంతటినీ దేవస్థానం ఈఓ లక్ష్మీనారాయణ స్వయంగా పర్యవేక్షించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ సుబ్బలక్ష్మయ్య మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి, యువ నాయకులు ఫయాజ్ మరియు ఫిరోజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రెండేళ్ల పదవీ కాలంలో దాతల సహకారంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని, చిరస్థాయిగా నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేపట్టి మంత్రి ఫరూక్ కి మంచి పేరు తీసుకువస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం అభివృద్ధికి నూతన పాలకమండలి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రివర్యులు ఫరూక్ మార్గదర్శకత్వంలో, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా, సేవా దృక్పథంతో ఆలయ ప్రతిష్టను పెంచేలా పాలకమండలి సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. దేవస్థాన అభివృద్ధి పనులకు తమ కుటుంబం మరియు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ బింగుమళ్ల సుబ్బలక్ష్మయ్య కి, సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కండె శ్యాంసుందర్ లాల్, ప్రధమనంది దేవస్థానం చైర్మన్ చలంబాబు, నంద్యాల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మరియు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్త, డైరెక్టర్ ఉప్పరి సురేష్, ప్రింట్ మీడియా అధ్యక్షుడు మధు, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ విజయ శేఖర్, అశోక్, వినయ్, నెరవాటి రవి, మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్, మండి మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలూరు కృష్ణాంజనేయులు , ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాక వరప్రసాద్, కండె ఆనంద్, ఆర్ వి సుబ్బయ్య, దేవస్థానం మాజీ అధ్యక్షుడు అరవేటి వాసు, విజయ్, 4వ వార్డు ఇంచార్జి మజీద్ మరియు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు.
