

ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి. ఫిరోజ్..
నంద్యాల జిల్లా / జనవరి 02- 2026 / సత్యం వార్త ప్రతినిధి :
నంద్యాల జనసేన పార్టీ సమన్వయకర్త పిడతల సుధాకర్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. కూటమి ఐక్యతకు నిదర్శనంగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పిడతల సుధాకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సుధాకర్ చేత కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ పిడతల సుధాకర్ నిరంతరం ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి అని ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయమైనది మాత్రమే కాదు, ప్రజా క్షేమం కోసం ఏర్పడిన ఒక బలమైన బంధం అని అన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఇదే సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి పార్టీల శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు . సుధాకర్ వంటి చురుకైన నాయకుల సహకారం కూటమికి ఎంతో కీలకం అన్నారు.
ఈ సందర్భంగా పిడతల సుధాకర్ మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి మరియు కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన-టిడిపి కార్యకర్తలు ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. పదవుల కంటే ప్రజలకు చేసే సేవలోనే నిజమైన తృప్తి ఉందన్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతానని వెల్లడించారు. తన మీద చూపిస్తున్న ఈ అభిమానం బాధ్యతను మరింత పెంచిందని, నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ చేతుల మీదుగా సుధాకర్ పై రాసిన పాటను రిలీజ్ చేయడం జరిగింది
ఈ వేడుకల్లో టిడిపి మాజీ కౌన్సిలర్ కృపాకర్, జనసేన పార్టీ నాయకులు సురేష్ చౌదరి ,నందిగల్ల సందీప్ కుమార్, సాయి జయంత్, సింహాచలం నగేష్ , అవుకు సంపత్ కుమార్, నాగేంద్ర అన్న, అఖిల్,జనార్దన్, వెంకటేష్ ,షేక్షావలి, జార్జ్, శరత్ మరియు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు మరియు అభిమానులు పాల్గొని సుధాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
