ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – ముఖ్య అతిధిగా పాల్గొన్న తాటికొండ బుగ్గరాముడు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 29 :నంద్యాల టౌన్ 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్,నందమూరి నగర్ నగర్ నందు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, బేడా బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు స్థానిక మంత్రి వర్యులు ఎన్ఎండీ.ఫరూక్, వారి కుమారులు ఎన్ఎండీ.ఫిరోజ్, ఎన్ఎండీ.ఫయాజ్  ఆదేశాల మేరకు మా వార్డు వై.యస్.ఆర్ నగర్, నందమూరి నగర్ నందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు.ఆనాడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారు అని ఈనాడు పార్టీ సిద్ధాంతాలను,గౌరవాలను మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నిలబెడుతున్నారు అని ఆయన అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు, మా స్థానిక మంత్రి వర్యులు అడుగుజాడలో మేము అందరం నడుచుకుంటూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేసి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మరాఠీ సూరి,తాటికొండ మహేష్ బాబు,వడ్డే నాగేంద్ర,సౌభాగ్యవతి, హిమామ్ హుస్సేన్, నారాయణ, ఉమా కాంతయ్య, మేషక్,షబ్బీర్, లక్షమయ్య,ప్రసాద్ రెడ్డి,గౌస్,సురేంద్ర గౌడ్,కసిరెడ్డి ప్రసాద్ రెడ్డి, గౌండా ఖలీల్,చందు,మల్లయ్య తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top